Home

Welcome to Your Local News By MSR

Jan 06 2026


 

అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా అప్పాజీ

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నభ్యునిగా చొల్లంగి అప్పాజీ నియమితులయ్యారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్ మీడియా పెడరేషన్ ఈ నియామకానికి సిఫార్స్ చేసింది. అప్పాజీ గత’ ‘ రెండు న్నర దశాబ్దాలుగా జర్నలీజం లో పనిచేస్తున్నారు. దీర్ఘకాలం పాటు ఆయన పలు పత్రికలు తోపాటు ఎలక్ట్రానిక్ మీడియా లోని పలు ఛానెల్స్ లో రిపోర్టర్గా పనిచేశారు. గత రెండేళ్లు గా సివిఆర్, బి.ఆర్.కె న్యూస్ ఛానల్లో గోదావరి జిల్లాల రీజినల్ కోర్డినేటర్ గా పనిచేస్తున్నారు.అప్పాజీ నియామకం తో అక్రీడేషన్ల విషయం లో తమకు నాయ్యం జరుగుతుందని కోనసీమ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పాజీ నియామకం పట్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి, నాయుకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, సుధీర్, శ్రీను తదితరులు అప్పాజీకి శుభాకాంక్షలు తెలిపారు.

Dec 28 2025

 

*విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గారు*

*మండల కేంద్రం అల్లవరం గ్రామంలో 2 విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.అందుకే ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు*…

*ఈ కార్యక్రమంలో అమూడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, బందిగుప్తాపు సత్తిబాబు, నడింపల్లి సుభ్రమణ్యం రాజు, వేగిరాజు వెంకటరాజు, జనసేన నాయకులు కంకిపాటి గోపి, కంకిపాటి వీరబాబు, పచ్చిమాల ఏడుకొండలు, ముత్యాల బాబీ, బొక్క ప్రసాద్, చిట్టినిడి దానయ్య నాయుడు, కొల్లు విష్ణు మూర్తి, నాతి లెనిన్ బాబు, నాగరజు,రాసురి రాంబాబు, గుబ్బల చిన్నబాబు , సుంకర సాయి మరియ తదితరులు పాల్గొన్నారు*…

Dec 26 2025

రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు కు ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాన్ని అందిస్తున్న అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమం లో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డి సి ఎం ఎస్ అధ్యక్షులు పెచ్చేట్టి చంద్రమౌళి, పెచ్చేట్టి విజయలక్ష్మి, తిక్కిరెడ్డి నేతాజీ,కర్రి దత్తుడు, చింతా శంకర్ మూర్తి తదితరులు.

Dec 12 2025

 *ప్రజా సమస్యల పరిష్కారానికే… “ప్రజా దర్భార్”*

– ఎమ్మెల్యే ఆనందరావు

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే… “ప్రజా దర్భార్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు.

ప్రజాదర్బార్ లో వచ్చిన వినతుల ద్వారా సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కి విశేష స్పందన కనిపించింది.

నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన అర్జీలను నేరుగా ఎమ్మెల్యే సమర్పించారు. ప్రజా సమస్యలను పరిశీలించి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యం వంటి పలు అంశాలకు సంబంధించిన అర్జీల పై త్వరతగతిన పరిష్కారం ఇవ్వాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు ఆనందరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకే, ఈ ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు.

వాటి పరిష్కారం కోసం నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సమస్యల పరిష్కారం కోసం తన కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అధికారి జయవెంకటలక్ష్మిబాబ్జి, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ✍️

Dec 11 2025

 

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ హరీష్ బాలయోగి

ఢిల్లీలోని పార్లమెంట్ సి బ్లాక్ లో జరిగిన కార్మిక, జౌళి మరియు నైపుణ్యాభివృద్ధి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ అధికారులతో మూడు ముఖ్య అంశాలపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనితీరు, విదేశీ ఉపాధి కోసం సిద్ధమవుతున్న వలస కార్మికులకు అందిస్తున్న నైపుణ్య మరియు భాషా శిక్షణ, అలాగే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పురోగతి గురించి చర్చించినట్లు తెలిపారు. యువతకు అందుబాటులో ఉండే అవకాశాలను, అలాగే విదేశాలకు వెళ్లే భారత కార్మికులు ఆధారపడే సహాయ వ్యవస్థలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే కీలకమైనవని, శిక్షణ కేంద్రాలపై మరింత బలమైన పర్యవేక్షణ, వలస కార్మికులకు మెరుగైన భాషా నైపుణ్యాలు వంటి సహాయం, అలాగే శిక్షణ తో ఉద్యోగాలు మరియు జీవనోపాధికి దారితీసేలా PMKVY 4.0 ను మరింత స్పష్టంగా, సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారన్నారు.

అదే విధంగా, కార్మిక & ఉపాధి, జౌళి మరియు స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖల 2025–26 ఆర్థిక సంవత్సర డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై సిద్ధం చేసిన ‘డ్రాఫ్ట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్’ను కూడా కమిటీ పరిశీలించి ఆమోదించిందని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.

Dec 10 2025

కోనసీమలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలి

అత్యవసర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి…

మంజూరైన క్యాన్సర్ డే సెంటర్ నిర్మాణం త్వరిగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలి…

377 ద్వారా లోకసభలో కోరిన ఎంపీ హరీష్ బాలయోగి

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి 377 ద్వారా లోకసభలో కోరారు. జిల్లాలో అత్యవసర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు లోపించడం వల్ల గ్రామీణ మరియు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో వైద్యపరమైన సమస్యలపై దృష్టి సారించి జిల్లాలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఆసుపత్రి లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం పక్క జిల్లాలపై ఆధారపడుతున్నారన్నారు. జిల్లాలో ట్రామా మరియు పాళీ ట్రామా సెంటర్ లేదా క్రిటికల్ కేర్ సెంటర్ లేకపోవడం వలన క్లిష్టమైన కేసులకు సకాలంలో ప్రాణాపాయ చికిత్స అందించడం సాధ్యం కావడం లేదన్నారు.

17 లక్షలకు పైగా జనాభాకు కేవలం తొమ్మిది సామాజిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల మాతా శిశు సంరక్షణ సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

కేన్సర్ డే సెంటర్ మంజూరైనప్పటికీ దాని నిర్మాణం ఇప్పటివరకూ మొదలు కాలేదని అన్నారు. కేన్సర్ రోగులు స్థానికంగా చికిత్స పొందలేక ఇబ్బందులు పడటంతో పాటు చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. మంజూరైన డే కేర్ కేన్సర్ సెంటర్ ను యుద్ధ ప్రాతిపదికన కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మిగిలిన అన్ని సౌకర్యాలను, లోపాలను సరిదిద్ది డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు నాణ్యమైన మరియు సకాలంలో ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ హరీష్ బాలయోగి కోరారు.

Dec 08 2025

చెత్తతో ఎరువు తయారీకి రూ. 3 కోట్లు
అమలాపురం కమిషనర్ నిర్మల్ కుమార్
అమలాపురం, స్వయంకృషి, డిసెంబర్ 8: కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాలతో చెత్త నుంచి ఎరువు తయారీకి ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ తెలిపారు. స్థానిక కమిషనర్ కార్యాలయంలో ‘స్వయంకృషి’ తో ఆయన సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. వైడ్రో కంపోస్ట్ విధానం ద్వారా చెత్తను ఎరువురుగా మార్చి రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. దీనికోసం రూ. 3 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రస్తుత డంపింగ్ యార్డ్ పక్కనే 2 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ప్లాట్ ఫామ్ నిర్మాణంతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించామన్నారు. నగరంలో ప్రతి రోజూ 32 టన్నుల వరకు చెత్తను సేకరిస్తున్నామన్నారు. ఇందులో 8 టన్నుల తడి చెత్తను ఎరువుగా మార్చి రైతులకు అందిస్తామన్నారు. ఈ ఎరువును మున్సిపాలిటీలోని మొక్కల పెంపకానికి ఉపయోగిస్తామన్నారు. అలాగే 4 టన్నుల తడి చెత్త పిట్ కంపోస్టింగ్ పద్ధతిలో భూమిలో కలిసిపోతుందన్నారు. అదే విధంగా 6 టన్నుల చెత్తను ప్లాస్మా టెక్నాలజీ ద్వారా బూడిదగా మార్చి తారు రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. ఒక టన్ను వ్యర్ధాలను మండించడం వల్ల 60 కేజీల బూడిద ఉత్పత్తి అవుతుందన్నారు. దీనివల్ల వాతావరణం కాలుష్యం జరగదన్నారు. మిగిలిన పొడి చెత్తను కబాడి కార్మికులు సేకరించుకొంటున్నారని తెలిపారు. నగరంలో 800 కుటుంబాల వారు ఇళ్లలోనే ఎరువులు తయారు చేసుకొని పూలు, పండ్ల మొక్కలు పెంచుకొంటున్నారని వివరించారు.

కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రీజినల్ డైరెక్టర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ఆదేశాల మేరకు నగరంలోని వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. ఒక షెల్టర్, 31 కెన్నెల్స్, ఐదు ఫీడింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రజలు ఫీడింగ్ కేంద్రాలలోనే కుక్కలకు ఆహారం అందించాలన్నారు. నగరంలో 435 కుక్కలను ప్రస్తుత సంవత్సరంలో గుర్తించామన్నారు. వచ్చే సంవత్సరానికి వీటి జనాభా 220 వరకూ పెరిగే అవకాశం ఉందన్నారు. షెల్టర్ లోని కుక్కలకు కు. ని. శస్త్ర చికిత్సలు, డీ వార్మింగ్, వాక్సినేషన్ జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ 396 కుక్కలకు కు. ని శస్త్ర చికిత్సలు, 399 కుక్కలకు వాక్సినేషన్, డీ వార్మింగ్ చేయించామన్నారు. కుక్కల వైద్యం, సంరక్షణ కోసం ఇద్దరు వెటర్నరీ వైద్యులతో కూడిన 10 మండి బృందం పని చేస్తుందన్నారు. స్నాప్ సంస్థ ద్వారా ఈ బాధ్యతలను నిర్వహిస్తామన్నారు. కుక్కల సంరక్షణ కోసం ముమ్మిడివరం నగర పంచాయితీకి అవసరమైన సహాయసహకారాలను అందిస్తామన్నారు.

Nov 29 2025

విద్యతోనే భవిష్యత్తుకు బంగారు బాట
ఎమ్ ఎస్ ఆర్ న్యూస్, అంబాజీపేట:
ప్రభుత్వ ఆదేశాల మేరకు బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తొండవరం హైస్కూల్ హెచ్ఎం ఎం.టి.వి. కేశవాచార్యులు తెలిపారు. సహ ఉపాధ్యాయులతో కలిసి వాకలగరువులో ఫిషర్ మెన్ పేట, బుల్లియ్య కాలనీ, రజకపేట ప్రాంతాలలో బడి ఈడు పిల్లల గురించి వాకబు చేశారు. తరచూ డ్రాప్ అవుట్ అవుతున్న పదవ తరగతి పిల్లల్ని పాఠశాలకు తిరిగి రప్పించడానికి శుక్రవారం ఇంటింటికి తిరిగారు. బడి మానేయకుండా ఇష్టపడి చదువుకుంటే భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చన్నారు. బడి మానివేసిన విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. బడి మాన్పించి వారి భవిష్యత్తును అంధకారం చేయొద్దని వివరించారు. పిల్లలను పాఠశాలలో కొనసాగించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Nov 28 2025

” కదిలే వాహనాల్లో కనిపించే దేవుళ్ళు”
జిల్లా రవాణా అధికారి దేవి శెట్టి
స్వయంకృషి, అమలాపురం:

సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్లే డ్రైవర్లు కనిపించే దేవుళ్లని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ డ్రైవింగ్ శిక్షణ స్కూల్ 12 వ బ్యాచ్ 16 మంది అభ్యర్థులతో ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా పాల్గొన్న రవాణా అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ డ్రైవర్లు కదిలే దేవుళ్ళని అభినందించారు. డ్రైవర్ల చేతిలో ఎంతో మంది విలువైన ప్రాణాలు ఉంటాయని, నైపుణ్యంతో విధులు నిర్వహించడానికి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని వివరించారు. . ఈ సందర్భంగా జిల్లా ప్రజారవాణాధికారి ఎస్ టి పి రాఘవకుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ శిక్షణ స్కూల్ లో డ్రైవర్లకు ప్రాక్టికల్ శిక్షణతో పాటు బస్సు మెయింటినెన్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు. డిపో మేనేజర్ డి ఎల్ ఎన్ శర్మ, ఎస్ సి కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి చేతుల మీదుగా అభ్యర్థులకు డ్రైవింగ్ శిక్షణా టెక్స్ట్ పుస్తకాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ ఇంచార్జ్ జి. ఆర్. ఎల్. దేవి, ట్రాఫిక్ ఇంచార్జ్ ప్రతిమా కుమారి, ఓ పి ఆర్ఎస్ ఇంచార్జి ఎన్ వరహాల బాబు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. అతి త్వరలో 13 వ బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు ఫోన్ నెంబర్ 7382909588 లో సంప్రదించాలని స్కూల్ ఇన్ ఛార్జ్ ఎండి రజాక్ తెలిపారు.

Nov 27 2025

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ, హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాలను, దివ్యాంగులకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత మే నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం వారీగా మందికి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన 832 రకాల ఉపకరణములను నేడు అందించారన్నారు. అలాగే నియోజకవర్గం పరిధిలో మిగిలిన వారికి కూడా తదుపరి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగు ఉపకరణాలను అందించేందుకు కృషి చేస్తామని ఎంపీ హరీష్ తెలిపారు.

Nov 26 2025

విద్యత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని నక్కా వారి పేటలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రెడ్డి అనంతకుమారి, బండారు శ్రీనివాస్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజల అవసరాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Nov 25 2025

నా ఇష్టం…రోడ్డుపైనే తాగుతా……!
మందుబాబులు, గంజాయి అడ్డాగా మారిన అయినవిల్లి
అయినవిల్లి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు నిలయమై, మండల విద్య, వ్యాపార కేంద్రంగా ఉన్న ముక్తేశ్వరం మందుబాబుల అడ్డాగా మారుతోంది. మరోపక్క మండలమంతా గంజాయి వాసనలు గుబాళిస్తున్నాయి. ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు రాత్రీపగలూ తేడాలేకుండా నడుస్తున్నాయి. అలాగే సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విపరీతంగా డంప్ అవుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతూతున్నా పోలీసు, ఎక్సైజ్ అధికారులు షరా “మామూలు” గా తీసుకొంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మండలానికి 5 అనుమతి కలిగిన షాపులను కేటాయించగా అందులో 3 ముక్తేశ్వరంలోనే ఉండటం విశేషం. వీటిలో లక్ష్మీ వైన్ షాప్ ఉన్న ప్రాంతం మద్యం వినియోగదారుల ” దర్ బార్” గా మారిపోయింది. ప్రసిద్ధ అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయం ఇక్కడికి కూతవేటు దూరంలో ఉంది. అలాగే క్షణ ముక్తీశ్వరాలయం, శ్రీరామ ప్రతిష్టిత శివాలయం సమీపంలోనే ఉన్నాయి. దీంతో నిత్యం చుట్టుపక్కల వారితో పాటు దూర ప్రాంతాలకు చెందిన భక్తులు, యాత్రికులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతాలను సందర్శించుకుంటారు. మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, లావాదేవీల నిమిత్తం వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. ఓ పక్క బ్యాంకు, మరోపక్క ఏటీఎం ల మధ్యలో లక్ష్మీ వైన్ షాప్ నెలకొల్పడంతో మహిళలు, విద్యార్థినులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బజారు ఏరియా కావడం, వైన్ షాప్ కి ఎదురుగా ఆటో స్టాండ్ ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే విద్యార్ధినులు, మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. బ్రాందీ షాపు పక్కనే పర్మిట్ రూమ్ ఉంది. మద్యం కొనుగోలుకు వచ్చేవారు రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. దీనికి తోడు మందుబాబులు రోడ్డ�

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా….

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన షెడ్యూల్

26వ తేదీ ఉదయం 8:30కు గంటలకు రోడ్డు మార్గం ద్వారా మాదాపూర్ ఇంటి నుంచి బేగంపేట ఏర్పాటుకు

9 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి 9: 45 కు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు రాక

9:50 కి హెలికాప్టర్ ద్వారా 10:10 కి గుడపల్లి కి

10:15 కి కేశనపల్లి వ్యూ పాయింట్ కు

10:20 కి నాశనం అయిన కొబ్బరి చెట్లు, పంటల గురుంచి గురించి 20 మంది రైతులతో ముఖాముఖి చర్చ

11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా శివకోడు విలేజ్ కు

11: 20 కు శివకోడులో

ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన
Phylon ఆవిష్కరణ
పల్లె పండుకు 2.0 ప్రోగ్రాం

12:20 కు శివకోడు మీటింగ్ జరిగే ప్రదేశానికి

12:30 కు శివకోడు హెలిపాడ్ కు

12:35 శివకోడు హెలిపాడ్ నుంచి రాజమండ్రి ప్రయాణం

01:10 కి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేటకు

Nov 23 2025





వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ హరీష్ బాలయోగి…

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల గ్రామంలో అడాప్టుడ్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తో కలిసి ప్రారంభించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పౌండేషన్ అధినేత భూపతిరాజు పెండేటి అభినందించారు.

Nov 20 2025

 

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం “కాటన్” విగ్రహం

రూ 5 లక్షలతో నిర్మాణం

ఇదీ గోదారోళ్ల మమకారం

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలయాలను నిర్మించే వాళ్ళని చూస్తుంటాము. లేదా ఆలయాల నిర్మాణానికి వారి పేరున అధిక విరాళాలు ఇచ్చే వారిని సూస్తాము. కాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సందిపూడిలో దొడ్డా సత్తిపండు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అయిదు లక్షల రూపాయలతో డెల్టా రూపశిల్పి సర్ ఆర్డర్ కాటన్ మహాశయుని భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద విశేషమేముంది చాలామంది గోదావరి జిల్లాలో ఇటువంటి విగ్రహాలను రైతు కుటుంబాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా అనుకోవచ్చు. కాని ఇతనికి సెంటు భూమి కూడా లేదు. అలాగని కౌలు వ్యవసాయం కూడా చేయడు. మరి ఎందుకు ఆయనంటే అంత అభిమానం అంటే తండ్రికిచ్చిన మాట.

సత్తిపండు తండ్రి దొడ్డా వెంకయ్య కూడా వ్యవసాయం చేసేవాడు కాదు. చిన్న కుటుంబం.ఎడ్లు బండి తోలుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఎప్పుడూ ఈ గోదావరి జిల్లాలు పచ్చదనంతో విరాజిల్లుతున్నాయంటే అందుకు ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టిన కాటన్ దేవుడేనని, ఎప్పుటికైనా సంధిపూడిలో ఆయన విగ్రహం కట్టాలని చెబుతుండేవాడు. అదే సత్తిపండులో నాటుకు పోయింది. తల్లిదండ్రులు వెంకయ్య, భూలోకం జ్ఞాపకార్ధం ఎప్పటికైనా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈయనది కూడా చిన్న కుటుంబం. ఇటుకల అమ్మకాలు చేస్తుంటాడు.సొంతంగా ఇటుక బట్టి కూడా లేదు. అయినప్పటికీ తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసిన అనంతరం ఈ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నాడు.

అయితే ఆర్థికం స్థోమత అంతగా లేని సత్తిపండు ఈ పెద్ద కార్యక్రమం చేస్తుండటంతో పలువురు దాతలు ముందుకు వచ్చి రూ.రెండు లక్షలు వరకూ విరాళాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.అయితే అతను తీసుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సొంతంగా ఈ భారీ విగ్రహాన్ని నిర్మించి అక్కడ చిన్న పార్కును కూడా ఏర్పాటు చేసారు.విదేశీయుడైన కాటన్ చేసిన మేలుకు విగ్రహం ఏర్పాటు చేసిన తీరు ఇప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గోదారోళ్ల మమకారం అంటే ఇలాగే ఉంటుందని సత్తిపండు చాటి చెప్పాడని పలువురు ప్రశంసిస్తున్నారు.

Nov 19 2025

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో అమలాపురం
ఎంపీ హరీష్ బాలయోగి , పి.గన్నవరం స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పర్యటించారు.
మామిడికుదురు మండలం పాస్టర్లపూడి నుంచి ఆదుర్రు వరకు నది తీర ప్రాంతాల్లో కోత తీవ్రంగా పెరుగుతుండడంతో
రైతులు స్థానికుల ఇబ్బందులనుతెలుసుకున్న నేతలు.
ఈ నేపథ్యంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నాలుగు కిలోమీటర్ల మేర పర్యటించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
నది కోత కారణంగా కొబ్బరి చెట్లు నేలమట్టమవడం
సాగు భూములు దెబ్బతినడం… భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందన్న భయాన్ని స్థానికులు నేతల దృష్టికి తీసుకువచ్చారు.
తక్షణ చర్యలు తీసుకొని రక్షణ గట్టులు నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Nov 18 2025

పవిత్ర మక్కా ఉమ్రా యాత్రికులమరణం పట్ల సంతాపం తెలుపుతూ YSRCP Dr .Br .అంబేద్కర్ కోనసీమ మాజీ జిల్లా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు మరియు ప్రస్తుత జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్ మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఎండి వై షరీఫ్. అమలాపురం అసెంబ్లీమైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా బాబు ,సౌదీ అరేబియాలో , మక్కా నుండి మదీనా వెళ్లే దారిలోజరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలుగు రాష్ట్రాల వాసులు మరణించడం పట్ల. ఖాదర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని అల్లాను దువా (ప్రార్ధన) చేశారు.ఉమ్రాయాత్రలో భాగంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు, అగ్ని ప్రమాదానికి గురయ్యి అందులో ప్రయాణిస్తున్న 43 మంది ప్రాణాలు కోల్పోవడంపై సౌదీ ప్రభుత్వం వారి కుటుంబాలను ఆర్థికపరంగా ఆదుకోవాలని అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని,గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు.మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అల్లాను ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచిన అబ్దుల్ ఖాదర్ మరియు ఎండివై షరీఫ్.

Nov 12 2025

ప్రజల హృదయాల్లో రాజేష్ ఎదగాలి: మాజీ మంత్రి విశ్వరూప్
అమలాపురం: మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఒక సామాన్య కార్యకర్త పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించి అభిమానుల గుండెల్లో మరోసారి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాంకు చెందిన రేవు రాజేష్ ఎంతోకాలంగా మాజీ మంత్రి విశ్వరూప్ కు అభిమానిగా గుర్తింపు పొందారు. అలాగే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందిస్తున్నారు. ఒడుదుడుకుల్లో కొంతమంది పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సంస్థాగతంగా పార్టీకి, వ్యక్తిగతంగా మాజీ మంత్రి విశ్వరూప్ కు విధేయుడిగా విశ్వసనీయంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం రేవు రాజేష్ పుట్టినరోజు వేడుకలను మాజీమంత్రి విశ్వరూప్, అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ అభిమానిగా, కార్యకర్తగా రాజేష్ అందిస్తున్న సేవలను అభినందించారు. ఏ సమయంలోనైనా తన అనుచరుడిగా వెన్నంటి ఉండే రాజేష్ కు తన కుటుంబం అండగా ఉంటుందన్నారు. పార్టీలో, ప్రజల హృదయాల్లో రాజేష్ ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామకమిటీ అధ్యక్షులు లంకే శ్రీను, ముత్తాబత్తుల సురేష్, లంకే చిరంజీవి, జోన్నాడా మహాలక్ష్మి, మట్టా నాని, ముదే దుర్గ బాబు, అంబటి శ్రీను, పండు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Nov 11 2025

మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం..

పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద ఒకచోట వదిలి వెళ్ళిపోయిన కిడ్నాపర్..

అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనగా మారింది..

నిన్న సాయంత్రం నుండి పాప ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేశారు.

ఈరోజు ఉదయం పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం వద్ద పాప ఆచూకీ కనుక్కున్న అమలాపురం పట్టణ పోలీసులు.

అమలాపురం పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి పాప ఆచూకీ కనుక్కున్న పోలీసులు..

మరికొద్ది సేపట్లో పట్టణ సిఐ వీరబాబు పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు..

Nov 10 2025

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

వైద్యం ఖర్చుల రియింబర్స్ మెంట్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ఆయన కార్యాయలంలో లబ్ధిదారులకు అందజేశారు.

లబ్ధి పొందిన వారిలో :-
1. సరిపెల్ల సుజాత – 81,000/- రూపాయలు.( పోతుకుర్రు గ్రామం)
2. ⁠బల్ల విజయ లక్ష్మి – 1,50,000/- రూపాయలు.(నాగుల్లంక)
3. ⁠కొరపు భవానీ శంకర్ – 63,366/- రూపాయలు.(అయినవిల్లిలంక)
4. ⁠ఊటాల రియానా – 30,127/- రూపాయలు.(నడిపూడి).
మొత్తం 3,24,493/- (మూడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంబై మూడు) రూపాయలు మొత్తాన్ని అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ వైద్యం ఖర్చులు రీయింబర్స్ మెంట్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు, ఎంపీ హరీష్ బాలయోగి కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Nov 09 2025

 

పవర్ హౌస్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.

అమలాపురం నియోజకవర్గం, రూరల్ మండలం, పేరూరు వై జంక్షన్ వద్ద నూతనంగా పవర్ హౌస్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు.
*ఈ కార్యక్రమం లో అముడా చైర్మన్ శ్
అల్లాడ స్వామినాయుడు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, తిరుమనాధం మురళి, మట్ట రామారావు తదితరులు.

Oct 28 2025

రైతు బజార్లో దోపిడి….
ధరల పట్టికలో రేట్లు కంటే అధికంగా వసూళ్లు…
కలిసి వచ్చిన మొంథా తుఫాన్…
పట్టించుకోని ఎస్టేట్ అధికారులు…
దళారులకు చెక్ పెట్టి రైతులే నేరుగా తక్కువ ధరలకు కూరగాయలు అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమలాపురం రైతు బజార్లో దళారులు ప్రవేశించి ఆ రైతు బజార్ ను సాశిస్తున్నారు. ప్రతీ రోజు ప్రభుత్వం సూచించే ధరలకంటే అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తూ ప్రజల నుండి దోపిడీ చేస్తున్నారు. ప్రతీ రోజు ఇదే దందా ఆ రైతు బజార్లో కొనసాగుతుందంటూ కొనుగోలు దారులు విమర్శిస్తున్నారు. బోర్డులో కనిపించే రేట్లు కన్న అధిక ధరలకు కూరగాయలు విక్రయించడం ఏమిటంటు ప్రశ్నిస్తుంటే అంతా మా ఇష్టం అన్నట్లుగా మొండిగా సమాధానం చెబుతున్నారు. మొంథా తుఫాన్ హెచ్చరికల్ నేపథ్యంలో మరీ దోపిడీకి పాల్పడుతున్నారు. దానికి తోడు క్వాలిటీ లేని కూరగాయలను విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ రైతు బజార్ ను నిత్యం పర్యవేక్షించే ఎస్టేట్ అధికారి, సిబ్బంది అక్కడ ఉన్నప్పటికీ చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారు. అసలు రైతులు కన్నా దళారులే అక్కడ వ్యాపారం చేస్తున్న చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Oct 25 2025

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన అమలాపురం మాజీ ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు.

 

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర అగ్ని ప్రమాద ఘటనపై అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న బస్సు దుర్ఘటనకు గురై పలువురు ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకమని ఆమె పేర్కొన్నారు.

మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం వారికి మెరుగైన వైద్యసేవలు, తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Oct 17 2025

ఎంపీ హరీష్ మధూర్ ను కలిసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర బృందం…

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అమలాపురంలో పర్యటిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర బృందం ఈ రోజు అమలాపురంలోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగిని కలిశారు. ఈ సందర్భంగా బృందం పరిశీలించిన అంశాలను ఎంపీ కి వివరించారు.డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకం ప్రజా అవసరాల మేరకు కొన్ని సూచనలను ఎంపీ బృందానికి తెలిపారు. తద్వారా ఈ పథకం ప్రజా అవసరాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని ఎంపీ హరీష్ బాలయోగి బృందానికి వివరించారు.

Oct 16 2025

 

ఎసిబి వలలో అమలాపురం ఎమ్మార్వో పి.అశోక్ ప్రసాద్.

లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో.. 50వేలుకు డీల్ కుదిర్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము

50వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు అయితే కార్యాలయం లో 5 లక్షల 8 దొరకడం తో ఖంగు తిన్న ఏసీబీ అధికారులు.

ఇద్దరిని రిమాండ్ కు పంపిన ఏసిబి అధికారులు.

 

Oct 13 2025

బోరు సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలి…

అమలాపురం: బోరు ఆధారిత సాగు భూములకు విద్యుత కనెక్షన్లు మంజూరి లో అధికారుల నిర్లక్ష్యం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా లంక భూములు వేసవిలో బోర్లపైనే సాగు చెయ్యాలి. అయితే వేసవికి ముందు రైతులు బోరు సర్టిపెకట్ల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అయినవిల్లి మండలంలో రైతులు బోరు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్న కనీసం దరఖాస్తును కూడా తీసుకునే అధికారి లేరని రైతులు వాపోతున్నారు. వీటిపై ప్రజా పిర్యాదుల ద్వారా నేరుగా రెవెన్యూ మంత్రికి సమస్యను వివరించటానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. వీటిపై ఉన్నతాధికారులు స్పందించి బోరు ధ్రువీకరణలు సత్వరం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sep 22 2025

ఇరు వర్గాల అమోదకరం గా పరిష్కారం చూపిన సబ్ ఇనస్పెక్టర్. 

కొబ్బరి తోటలో కొట్టిన కలుపు మందు గాలికి ఎగిరి వరి చేను లో పడి దెబ్బతిందంటూ అయినవిల్లి పోలీసులు కు పిర్యాదు చేసిన ఘటన పై సబ్ ఇనస్పెక్టర్ మంచి పరిష్కారం చూపారు. కలుపు మందు తో దెబ్బతిన్నది అంటున్న ప్రాంతంను విడిగా కోత కోసి వచ్చిన దిగుబడిను , అదే పొలంలో దెబ్బతినలేని చోట వచ్చిన దిగుబడి తో లెక్కించి కలుపుందు పడిన చోట దిగుబడి తగ్గితే తగ్గిన
పంటను బాధితుడు కు ఇవ్వాలి. ఈ పరిష్కారం ఇరువర్గాలు సంతోషంగా ఆమోద తెలపటం విశేషం.

Sep 21 2025

కండక్టర్ కుసుమ కుమారుని విధుల్లోకి తీసుకోవాలి
రాజమహేంద్రవరం: జంగారెడ్డిగూడెం డిపో కండక్టర్ శ్రీమతి కుసుమ కుమారిని విధులకు అనుమతించాలని యునైటెడ్ వర్త్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. సూర్య ప్రకాష్ రావు కోరారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్టీసీ ఉన్నత అధికారుల దృష్టికి నివేదించాలనే సదుద్దేశంతో గత సోమవారం జంగారెడ్డిగూడెం డిపోలో పని చేస్తున్న కండక్టర్ శ్రీమతి కుసుమ కుమారి ఒక చిన్న వీడియో ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. . దీనిపై సంస్థాగతంగా విచారణ జరిపి ఉన్నప్పటికి డిపో అధికారులు ఆమెను ఏ విధులలో చూపించకుండా,ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఆమెను విధులకు దూరం పెట్టడం ఏపీసిఎస్ (సిసిఏ) రూల్స్ 1991 సెక్షన్ 8(1) కి పూర్తి వ్యతిరేకమన్నారు. ఇది సంస్థలో ఉన్న అత్యున్నత ప్రమాణాలకు వ్యతిరేకం అవుతుందని, భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 ప్రకారం తమ సమస్యలను చెప్పుకునే వాక్ స్వాతంత్ర్యం పౌరులకు, ఉద్యోగులకు ఉందన్నారు.. అదే విషయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు తీర్పుల ద్వారా ప్రకటించడం జరిగిందన్నారు. కండక్టర్ కుసుమ కుమారిని విధులకు అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య అవుతుందన్నారు.
ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకొని రాజ్యాంగ ప్రమాణాలను పాటించేలా, సంస్థ న్యాయ ప్రమాణాలకు తగిన విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Sep 20 2025

కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో ఫ్లెక్సీల వివాదంపై పోలీసుల ఉక్కుపాదం

​వివాదాస్పద కంటెంట్‌పై కఠిన చర్యలు తప్పవు

డీఎస్పీ మురళీమోహన్ హెచ్చరిక

​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట సబ్ డివిజన్‌లోని పది మండలాలకు చెందిన ఫ్లెక్సీ ఓనర్లతో శనివారం కొత్తపేట డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ సుంకర మురళీమోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, రాబోయే పండుగలు, సినిమా విడుదలల సందర్భంగా వివాదాస్పద కంటెంట్ ఉన్న ఫ్లెక్సీలను ముద్రించవద్దని ఆయన స్పష్టం చేశారు.

​విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌పై హెచ్చరిక:
కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండే ఎలాంటి వ్యాఖ్యలు, సంకేతాలు, సూచనలు ఫ్లెక్సీలలో కనిపించినా దాని బాధ్యత పూర్తిగా ఫ్లెక్సీ షాప్ ఓనర్‌దేనని డీఎస్పీ హెచ్చరించారు.

​ఒత్తిడికి లొంగవద్దు: అనుచితమైన కంటెంట్‌ను ముద్రించాలని ఎవరైనా ఫ్లెక్సీ షాప్ ఓనర్లపై ఒత్తిడి తెస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భరోసా ఇచ్చారు.

​ప్రభుత్వ స్థలాల్లో అనుమతి తప్పనిసరి
ప్రభుత్వ స్థలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయదలిస్తే సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.

​ఈ సమావేశంలో రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు, పి. గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భీమరాజు, కొత్తపేట ఎస్సై సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యలు జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి ఎంతగానో దోహదపడతాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sep 19 2025

పేద విద్యార్థిని చదువుకు రమణారావు ఆర్థిక సాయం.

అమలాపురం.పేద విద్యార్థిని చదువు కొనసాగించేందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు శుక్రవారం ఆర్థిక సాయం అందజేసి ప్రోత్సాహాన్ని అందించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ఊర పేటకు చెందిన ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థిని గంటి జానకి గోడి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ బైపిసి గ్రూపు చదివి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.జానకి బి ఎస్ సి ఫిషరీస్ కోర్సు చదివేందుకు ఆసక్తి కనపరిచింది. ఫిషరీస్ కోర్సు ప్రైవేటు కాలేజీలో చదవాలంటే రూ.1 లక్ష 60 వేలు ఫీజు చెల్లించాలి.తండ్రి అనారోగ్యంతో మృతిచెంది ఆర్థిక స్తోమత లేని జానకి కి తనకు ఇష్టమైన బి ఎస్ సి ఫిషరీస్ కోర్సును చదివించేందుకు రమణారావు ముందుకు వచ్చారు. నాలుగు సంవత్సరాలు బి ఎస్ సి ఫిషరీస్ కోర్సు చదివేందుకు జానకికి ఇప్పటికే రెండు సంవత్సరాల కోర్సు చదివేందుకు రమణారావు ఆర్థిక సాయం అందించారు.మూడో సంవత్సరం ఫీజుగా రూ.30 వేలు ఆర్థిక సాయం చేశారు. అమలాపురం లోని గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయంలో జానకికి రూ.30 వేలు చెక్కును గుడ్ ఫౌండేషన్ సభ్యులు పందిరి సుబ్బరాజు, గంటా లక్ష్మీ ప్రసాద్, నేరేడుమిల్లి శ్రీను, మణికంఠ,విప్పర్తి రమేష్,దాసు తదితరులు అందజేశారు. చదువుకునేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆర్థిక సాయం అందజేసిన రమణారావుకు ఈ సందర్భంగా జానకి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Sep 18 2025

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్ రావిరాల ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పి శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు చట్టాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించుకున్నారు.

Sep 17 2025

డాక్యుమెంట్ రైటర్స్ యూనియన్ అధ్యక్షుడిగా జున్నురి సురేశ్
అమలాపురం: అమలాపురం సబ్ రిజిష్టర్ కార్యాలయ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు, సహాయకులు సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశం లో నూతన సంఘ గౌరవ అధ్యక్షులు గా శ్రీ గుంటు ఫణి ప్రసాద్, ప్రెసిడెంట్ గా జున్నురి సురేష్, వైస్ ప్రెసిడెంట్ గా వెనుతురుపల్లి సుబ్బు , సెక్రటరీ గా పందిరి హరి, వైస్ సెక్రటరీగా పెద్దిరెడ్డి దుర్గేష్, ట్రెజరర్ గా గుమ్మల్ల నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జున్నురి సురేశ్ మాట్లాడుతూ లేఖరులు, సహాయకుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 19, 20 తేదీలలో రాష్ట్ర లేఖర్ల సంఘం పిలుపు మేరకు “పెన్ డౌన్” చేస్తామని చెప్పారు. ప్రజలకు, లేఖర్లకు ఇబ్బంది గా ఉన్న ట్రిబుల్ ఓ.టి.పి, డేటా ఎంట్రీ సమస్యలు పరిష్కారానికి నిరసన తెలియజేస్తామన్నారు. ఆరోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో ప్రజలకు అసౌకర్యం కలగడంపై లేఖర్ల సంఘాన్ని మన్నించాలని కోరారు. లేఖర్లు అందరు 19,20 తేదీల్లో రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లను తయారుచేయరాదని, ప్రజలకు, పార్టీలకు సమస్యను వివరించాలన్నారు. లేఖర్లందరు కార్యాలయాలను మూసివేసి నిరసనలో పాల్గొనాలని, 19 న కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చే కార్యక్రమంలో హాజరు కావాలని కోరారు.

MLA శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారి చేత బ్రాండ్‌అడ్స్ లోగో ఆవిష్కరణ
అమలాపురం, ఆంధ్రప్రదేశ్ – 16-09-2025 – కొత్త తరహా డిజిటల్ మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్ సంస్థ బ్రాండ్‌అడ్స్ (BrandAds) లోగో మరియు పేరును గౌరవనీయులైన ఎంఎల్ఏ శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రాండ్‌అడ్స్ తమ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించగా, వ్యాపారాలను సృజనాత్మకంగా, ఆధునిక పద్ధతులతో, డేటా ఆధారిత వ్యూహాలతో ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించింది.
ఈ సంస్థను సోమ సుందర రెడ్డి మరియు శ్రీ మణి స్థాపించారు. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, SEO, బ్రాండింగ్, క్రియేటివ్ అడ్వర్టైజింగ్ వంటి విభాగాల్లో పూర్తి స్థాయి డిజిటల్ సేవలను అందించడం బ్రాండ్‌అడ్స్ లక్ష్యం.
ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంఎల్ఏ శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు, వ్యవస్థాపకులను అభినందిస్తూ ఈ సంస్థ కొత్త వ్యాపారవేత్తలకు అవకాశాలను కల్పిస్తుందని, ప్రాంతీయ వ్యాపార వృద్ధికి తోడ్పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
“Target • Engage • Elevate” అనే ట్యాగ్‌లైన్‌తో బ్రాండ్‌అడ్స్ ఆధునిక డిజిటల్ వ్యూహాలను, ఆకర్షణీయమైన ప్రచారాలను మరియు వినూత్న డిజైన్‌లను అందించడానికి సిద్ధమైంది.

ఈ కార్యక్రమంలో విసికె పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ. రవి శ్రీను మరియు ఊ ట ల వెంకటేష్ మో కా శ్రీను రేవు తిరుపతిరావు మోకా ఉదయ్ తదితరులు పాల్గొని నూతన వ్యాపారం అభివృద్ధి చెందాలని శ్రీమణి శ్యాంసుందర్ కి శుభాకాంక్షలు తెలియపరిచారు.

Sep 16 2025

ఈనాడు విలేకరి చంద్రశేఖర్ పై దాడిని ఖండించిన “జాప్”

కాకినాడ:

సీనియర్ జర్నలిస్ట్ గా కాకినాడలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న చంద్ర శేఖర్ పై కొందరు దుండగులు దాడి చేయడం అత్యంత అమానుష ఘటన గా జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జీప్) తీవ్రంగా ఖండిస్తూ ఇది ఆందోళన కరమైన ఘటనగా పరిగణించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్.ఎం.కృష్ణంరాజు , జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్.ఎస్. కనకాద్రి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతెన శ్రీనివాస వర్మ లు జర్నలిస్టు చంద్రశేఖర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించా రు.చంద్రశేఖర్ అత్యంత సమర్థుడైన జర్నలిస్టు గా పేరు తెచ్చుకున్నారని, అలాంటి వ్యక్తిపై దాడి చేయడం తీవ్ర ఆవేదన ఆందోళనను కలిగిస్తున్నది. సంఘటన జరిగిన వేంటనే జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్.ఎమ్.కృష్ణంరాజు చంద్రశేఖర్ ను ఆయన గృహంలో కలిసి పరామ ర్శించారు.కొంతమంది వ్యక్తులు ఈయనను టార్గెట్ గానే దాడి చేసినట్లుగా అతనికి తగిలిన గాయాలు బట్టి అర్థం అవుతోంది. సమాజంలో పెరిపోతున్న దాడుల సంస్కృతి ని ఇది అద్దం పడుతోంది. అత్యంత ప్రశాంతకు పేరొందిన కాకినాడలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని జాప్ అభిప్రాయపడుతోంది. జర్నలిస్టు చంద్రశేఖర్ పై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని జాప్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు , ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని జాప్ డిమాండ్ చేస్తోంది. చంద్రశేఖర్ పూర్తిగా కోలుకొని తన విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ఇలాంటి ఘటనలపై జాప్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ జర్నలిస్టులకు అండగా ఉంటుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) తెలిపింది.

Sep 13 2025

బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్‌ మీనా.

ఏపీ లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు.

 మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ.

 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగింపు.

 బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్‌ మీనా.

 బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్‌.

 నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల.

 తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు.

 అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్‌ కునుగిలి.

 కడప జిల్లా ఎస్పీగా నచికేత్‌.

 నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్‌ షెరాన్‌.

 విజయనగరం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్‌.దామోదర్‌.

 కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడు.

 గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌.

 పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు.

 ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు.

 చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్‌ డూడి.

 శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్‌కుమార్‌..

 Sep 14 2025

  •  అక్టోబరు 1న వాహనమిత్ర..
  • మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం..

▪️ఈనెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరణ.

► నిబంధనలు ఇవే

▪️ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
▪️దరఖాస్తుదారు ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
▪️వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఉండాలి.
▪️ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫి కెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. ఒక నెలలోపు ఆ సర్టిఫి కెట్ పొందాల్సి ఉంటుంది.
▪️దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి/రేషన్ కార్డు కలిగి ఉండాలి.
▪️దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/ పెన్షనర్ గా ఉంటే అనర్హులు.
▪️పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
▪️ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు లెక్కిస్తారు.
▪️వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి.
▪️పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడు గుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
▪️తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్దిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు.

Scroll to Top