Nov 27 2025
సాధారణంగా పోలీసు కేసులన్నీ ప్రాసిక్యూటర్లే నిర్వహిస్తారు. కోర్టు అనుమతితో ప్రయివేటు న్యాయవాదులు కూడా హాజరు కావచ్చు. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో నిమిత్తము లేకుండా కేసు నిర్వహణను మరెవరికయినా సంక్రమింపజేయు విశేషాధికారము మేజిస్ట్రేట్లకు ఉంది. ఉదాహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై తనకు విశ్వాసము లేదని, అందువలన తన కేసును తానే వాదించుకుంటానని ఫిర్యాది (de-facto complainant) మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులో ఉదహరించిన కారణములు సమంజసమైనవేనని మేజిస్ట్రేటు భావిస్తే అనుమతించవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి లేక ఫిర్యాది తనకుతానుగానే కేసును నిర్వహించుకొనవచ్చు. లేక తనకు ఇష్టమైన న్యాయవాదిని నియమించుకొనవచ్చు.
కొన్ని సార్లు ప్రాసిక్యూటర్ పై పోలీస్ ఉన్నతాధికారులకు విశ్వాసం లేకపోయినా సామర్థ్యం లేదని అనుకున్న పోలీస్ అధికారి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించి కేసును నడపవచ్చు. అయితే మేజిస్ట్రేట్ 339(1) లో నిబంధనలు పాటించాలి
1 ఇన్స్పెక్టర్ ర్యాంకు కు క్రింద అధికారికి అర్హత లేదు.
2. ఇన్వెస్టిగేషన్ తో సంబంధం ఉన్న పోలీస్ అధికారి కూడ ప్రాసిక్యూటర్ గా పనికి రారు.
ఈ సెక్షనులో వాడబడిన భాషను బట్టి కేసును నిర్వహించు అధికా రము పోలీసు అధికారులకు కూడా ఇవ్వవచ్చు. అయితే, కేసు ప్రాథమిక విచారణతో ఆ అధికారికి ఎటువంటి సంబంధము ఉండరాదు. కేసును గురించి ప్రాథమిక పరిశీలన జరిపిన పోలీసు అధికారి నిష్పాక్షికంగా వ్యవహరించలేడు. అందువలన ఈ నిబంధన ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ సిఫార్స్ తో నియమించ బడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల పై ఇటీవల కాలంలో ఇటువంటు ఆరోపణలు తరచూ వస్తున్నాయి.దానికి కారణం కూడా లేకపోలేదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రాసిక్యూటర్ నియామకాలు జరుగుతుంటాయి.అవి ఏ ప్రాతిపదికన జరుగుతాయో జగమెరిగిన సత్యమే.
Oct 10 2025
నకిలీ వీలునామాలకు యావజ్జీవ శిక్ష…
ఫేక్ వీలునామలు తయారీ చేసి విలువైన ఆస్తులను కొట్టెయ్యాలి అంటే యావజ్జీవిత కారాగారం శిక్షకు రెడీగా ఉండాలి. ఇటీవల కాలంలో నకిలీ వీలునామా ల తో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్న తీరు కు BNSS 2025 సెక్షన్ 338 గొప్ప పరిష్కారం ఇచ్చింది . ఈ సెక్షన్ కింద నకిలీ వీలునామాలు కోసం, మరణ ధ్రువపత్రాలు తయారీ చేయడం తోపాటు వివిధ అనుబంధ పత్రాలను సృష్టించిన వ్యక్తులు కూడా ఈ సెక్షన్ ఫరిది లో ఉంటారు. ఇలా చేసి దొరికి పోతే
జీవిత ఖైదు లేదా పదేళ్ల పరిధిలో జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది..ఇది ఒక గంభీర మైన నేరంగా పరిగణించబడి, ఈ నేరం కొరకు విచారణ మొదటి తరగతుల మేజిస్ట్రేట్ కోర్టు ద్వారా నిర్వహించబడుతుంది. అలాగే, ఈ నేరం నాన్-బేలియబుల్ (బైలు ఇవ్వరాదు) పరిధి లోనిది. మరణ ధ్రువపత్రాలు తయారు చేసిన వారికి కూడా అదే సెక్షన్ కింద శిక్షలు విధిస్తారు.ఈ నిబంధనలు కుటుంబ ఆస్తుల హక్కులను రక్షించడానికి, వివాదాలు, మోసాలకు అడ్డుకట్ట వేయడానికి మరియు న్యాయవ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రవేశపెట్టబడ్డాయి. ప్రజలు అటువంటి పిర్యాదు తో వస్తె అది సివిల్ కేసు గా పోలీసు అధికారి తిరస్కరించడం కూడా శ్రేయస్సు కాదు. పత్రాల ప్రమాణాలపై విచారణ అవశ్యకత ఉంది
Oct 09 2025
నేరస్తుడు నేరం చేశాడని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్ పై ఉంటుంది.
నేరస్తుడు తన కేసు
సాధారణ మినహాయింపులు (“General Exceptions”) లేదా ప్రత్యేక మినహాయింపులు (“Special Exceptions”) పరిధిలో వస్తుందని వాదిస్తే నేలకుపోయేది నెత్తికి రాసుకున్నట్లు అవుతుంది.
.— ఆ మినహాయింపులను నిరూపించే భారము (Burden of Proof) ప్రాసిక్యూషన్ నుండి నిందితుడికి షిప్ట్ అవుతుంది….. ఆ మినహాయింపులు బి. ఎన్.ఎస్ 2023 సెక్షన్స్ 14 నుంచి 27 వరకు ఇచ్చారు.ఒక వేళ నేరం చేసినప్పటికీ మీరు ఖచ్చితంగా ఆ మినహాయింపు పరిధి లో ఉన్నారని గట్టి నమ్మకం ఉండి మీ కేసును వాదించే లాయర్ సమర్థవంతంగా నిరూపిస్తే మీరు కేసునుండి బైట పడతారు. ఉదాహరణకు ఒక పోలీస్ అధికారి ఒక గ్రామంలో నేరం జరుగుతుంది అనే సమాచారంతో తన వాహనం లో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి మరణించాడు ఇపుడు వాహనం లో ప్రయాణం చేస్తున్న పోలీస్ అధికారికి కానీ వాహన డ్రైవర్ కి కానీ సదరు వ్యక్తిని ఢీకొట్టాలనే ఉద్దేశ్యం ఉండదు .కేవలం సదరు అధికారి తన విధులు నెరవేర్చే క్రమంలో నే ఈ దుర్ఘటన జరిగింది. ఇటువంటి కేసుకు మినహాయింపు దొరుకుతుంది.అయితే ప్రత్యేక పరిస్థితులు ఉంటే ఆ eమినహాయింపు దొరకదు..
Oct 05 2025
IPC,CRPC లు తెలుసు RBC రణబీర్ penal కోడ్ ఒకటి మన దేశంలో అమలు2019 వరకూ అమలు లో ఉండేది.
Ranbir Penal Code (RBC) ప్రస్తుతం అమలులో లేదు.1954లో ప్రారంభమైన ఈ కోడ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో IPCకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతూ వచ్చింది. అయితే 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దు చేసి, 2019 అక్టోబర్ 31 నుండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో IPC అమల్లోకి వచ్చింది.అందువలన, Ranbir Penal Codeని పూర్తిగా తీసివేసి Indian Penal Code (IPC) ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ప్రామాణిక క్రిమినల్ కోడ్ గా ఉంది. 2024లో Bharatiya Nyaya Sanhita ప్రవేశపెట్టడంతో IPC కూడా BNS గా మారింది..మొత్తానికి, RBC 188 సహా Ranbir Penal Code ఇప్పుడు అమల్లో లేదు. జమ్మూ కాశ్మీర్ లో BNS నిబంధనలు అమలు కావడం జరుగుతుంది.
విద్యుత్ కనెక్షన్ పొందడం రాజ్యంగ పరమైన హక్కు.ఈ హక్కును కాలరాసే స్వేచ్ఛ విద్యుత్ అధికారాలకు లేదు.
అయితే ఇటీవల కాలం లో విద్యుత్ అధికారుల నిర్లక్ష ధొరణి, అవగాహన లేమి కారణంగా అడ్డదిద్దమైన కుంటు సాకులు చెప్పి కనెక్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారనే కేసులు విద్యుత్ అదాలత్ వరకూ పోతున్నాయి.అలాగే హైకోర్టులు వరకూ చేరుతున్నాయి. విద్యుత్
చట్టం, 2003 సెక్షన్ 43 ను పూర్తిగా అవగతం చేసుకోవాల్సిన అవశ్యకత అధికారులపై ఉంది.దీని ప్రకారం ఎవరైనా తన ఆక్రమణ లో ఉన్న భూమికి విద్యుత్ కనెక్షన్ కావాలి అని దరఖాస్తు పెట్టినా ఇవ్వాల్సిందే.
ఎవరైనా స్థల యజమాని లేదా ఆక్రమణదారుడికి విద్యుత్ సరఫరా చేయటం చట్టబద్ధమైన బాధ్యత. అలా ఇవ్వక పోతే వారి యొక్క జీవించే హక్కు కు బంగం కలిగినట్లు అని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది.ఇక్కడ భూమికి డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అనేది అవసరం లేదు.
అదేవిధంగా, సెక్షన్లు 43 మరియు 44 ప్రకారం విద్యుత్ సరఫరా కోసం సరఫరా స్థలం అనేది వినియోగదారుని ప్రాంగణమే అవుతుంది. విద్యుత్ కనెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఎవరికి టైటిల్ రాదు. విద్యుత్ బకాయిల బాధ్యత ఎల్లప్పుడూ వినియోగదారునిపై మాత్రమే ఉంటుంది . కోర్టు డిస్ప్యూట్ లో ఉన్న భూమికి సైతం విద్యుత్ ఇచ్చి బాధ్యత అధికారులదే. కాబట్టి ఆ స్థలాన్ని “డిఫాల్టర్”గా పరిగణించడం లేదా విద్యుత్ బకాయిలను ఆ స్థలానికి అనుసంధానం చేయడం చట్టపరంగా చెల్లదు.ఈ సూత్రాన్ని భారత సుప్రీంకోర్టు ధృవీకరించింది — విద్యుత్ కనెక్షన్ అనేది ఆస్తికి (property) కాకుండా వినియోగదారునికి (consumer) సంబంధించినదని స్పష్టం చేసింది.విద్యుత్ సంస్థలు రైతులను వేధిస్తూ, కోర్టులో వివాదంలో ఉన్న భూములకు (lis pendens lands) విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం నిరాకరిస్తున్నాయి. అంతేకాదు, “భూమి కోర్టులో ఉంది” అనే సాదాసీదా కారణంతో ఎండ్ోర్స్మెంట్లు ఇచ్చి తమ చట్టపరమైన బాధ్యతను తప్పించుకుంటున్నాయి. ఇది విద్యుత్ చట్టం, 2003 లోని సెక్షన్ 43 కి
పూర్తిగా వ్యతిరేకం — ఈ సెక్షన్ ప్రకారం ఏ స్థల యజమాని లేదా ఆక్రమణదారుడు అయినా సరఫరా పొందే హక్కు కలిగివున్నాడు. విద్యుత్ అనేది జీవించే హక్కుకు మూలాధారం దీనిని కాదనే అధికారులు మూల్యం చెల్లించు కావల్సిందే. చట్టం లో లేని విషయాలను విద్యుత దరఖాస్తుల తిరస్కరణకు వాడుకుంటే సదరు అధికారి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి తప్ప విద్యుత్ శాఖ తప్పిదం కాదు.
Oct 04 2025
స్ట్రింగ్ ఆపరేషన్ కి నైతకత ఉందా?
మనం తరచూ జర్నలిస్టులు స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ లంచాలు తీసుకునే అధికారుల్ని,రాజకీయ నాయకులను తెలియ కుండా వీడియోలు చిత్రీకరించి సమాచార మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. దీనిపై సుప్రీం కోర్టు లో ఒక కేసు సందర్భంగా పలు వాదనలు జరిగాయిBnss సెక్షన్ 175.26.
స్టింగ్ ఆపరేషన్ కి నైతకత ఉందా?…
మనం తరచూ జర్నలిస్టులు స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ లంచాలు తీసుకునే అధికారుల్ని,రాజకీయ నాయకులను తెలియ కుండా వీడియోలు చిత్రీకరించి సమాచార మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. దీనిపై సుప్రీం కోర్టు లో ఒక కేసు సందర్భంగా పలు వాదనలు జరిగాయి. స్ట్రింగ్ ఆపరేషన్
వినియోగంపై సుప్రీంకోర్టు అభిప్రాయం ఇలా ఉంది.సుప్రీంకోర్టు చివరగా ఇలా పేర్కొంది:“స్టింగ్ ఆపరేషన్లు”, విదేశీ న్యాయవ్యవస్థల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వయంగా చేసే సందర్భంలో కూడా, క్రైమ్ డిటెక్షన్ (నేర గుర్తింపు) లేదా నేర నిరూపణలో పరిపూర్ణ సూత్రంగా గుర్తించబడలేదు.భారతదేశంలోనైతే, అలాంటి అధికారికంగా నిర్వహించే స్టింగ్ ఆపరేషన్లు ఇప్పటివరకు అమలు చేయబడలేదు, ప్రయోగించబడలేదు. అవి మన న్యాయవ్యవస్థలో అంగీకరించదగినవేనా, లేదా అనేది ఇంకా సమాధ లేని ప్రశ్నగానే ఉంది. దీనికి కారణం లేకపోలేదు నేరస్తున్ని నేరం చేయుటకు ఉరికొల్పి నట్టే అనే భావన ఉంది. అందుకే స్టింగ్ ఆపరేషన్ పేరు చేప్పి ఎవరినైనా ఇబ్బంది పెడితే మీరుకూడా నేరాన్ని పురికొల్పినట్టుగా ప్రాసిక్యూషన్ కి గురికావాల్సి వస్తుంది. ఒక “విక్టిం” (బాధితుడు), సాధారణ పరిస్థితుల్లో నిర్దోషిగా ఉంటాడు. కానీ అతనిని రహస్యమనే హామీతో, మోసపూరిత పద్ధతిలో నేరం చేయడానికి ప్రోత్సహిస్తారు. అతను సాధారణంగా చేయని నేరాన్ని ఇటువంటి ప్రలోభం వల్ల చేస్తాడు. అప్పుడు ఆ నేరానికి అతనిని బాధ్యుడిగా ఎలా పరిగణించాలి అన్న ప్రశ్న వస్తుంది.ఇంకా ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే—నేరాన్ని నిర్ధారించడానికి వాడిన ఈ విధానం స్వయంగా ఒక తప్పిద చర్య (culpable act) అవుతుంది.
అయితే స్ట్రింగ్ కానీ పద్దతి లో పెయిర్ సంఘటనల మాత్రం చిత్రీకరణ చేయొచ్చు. మరి ఈ పరిధిని అర్దం చేసుకోకుండా వీడియోలు చిత్రీకరిస్తే… చిక్కులు రావచ్చు..
Mv. సుబ్బారావు.. స్ట్రింగ్ ఆపరేషన్
వినియోగంపై సుప్రీంకోర్టు అభిప్రాయం ఇలా ఉంది.సుప్రీంకోర్టు చివరగా ఇలా పేర్కొంది:“స్టింగ్ ఆపరేషన్లు”, విదేశీ న్యాయవ్యవస్థల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వయంగా చేసే సందర్భంలో కూడా, క్రైమ్ డిటెక్షన్ (నేర గుర్తింపు) లేదా నేర నిరూపణలో పరిపూర్ణ సూత్రంగా గుర్తించబడలేదు.భారతదేశంలోనైతే, అలాంటి అధికారికంగా నిర్వహించే స్టింగ్ ఆపరేషన్లు ఇప్పటివరకు అమలు చేయబడలేదు, ప్రయోగించబడలేదు. అవి మన న్యాయవ్యవస్థలో అంగీకరించదగినవేనా, లేదా అనేది ఇంకా సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. దీనికి కారణం లేకపోలేదు నేరస్తున్ని నేరం చేయుటకు ఉరికొల్పి నట్టే అనే భావన ఉంది. అందుకే స్టింగ్ ఆపరేషన్ పేరు చేప్పి ఎవరినైనా ఇబ్బంది పెడితే మీరుకూడా నేరాన్ని పురికొల్పినట్టుగా ప్రాసిక్యూషన్ కి గురికావాల్సి వస్తుంది. ఒక “విక్టిం” (బాధితుడు), సాధారణ పరిస్థితుల్లో నిర్దోషిగా ఉంటాడు. కానీ అతనిని రహస్యమనే హామీతో, మోసపూరిత పద్ధతిలో నేరం చేయడానికి ప్రోత్సహిస్తారు. అతను సాధారణంగా చేయని నేరాన్ని ఇటువంటి ప్రలోభం వల్ల చేస్తాడు. అప్పుడు ఆ నేరానికి అతనిని బాధ్యుడిగా ఎలా పరిగణించాలి అన్న ప్రశ్న వస్తుంది.ఇంకా ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే—నేరాన్ని నిర్ధారించడానికి వాడిన ఈ విధానం స్వయంగా ఒక తప్పిద చర్య (culpable act) అవుతుంది.
అయితే స్ట్రింగ్ కానీ పద్దతి లో పెయిర్ సంఘటనల మాత్రం చిత్రీకరణ చేయొచ్చు. మరి ఈ పరిధిని అర్దం చేసుకోకుండా వీడియోలు చిత్రీకరిస్తే… చిక్కులు రావచ్చు.
Oct 02 2025
నూతన బి. ఎన్. ఎస్. ఎస్. చట్టం లో కొన్ని విశేషాలు…
సెక్షన్ 187…ముఖ్య ఉద్దేశ్యం: నిందితులు మొదటి 15 రోజుల పోలీసు కస్టడీని తప్పించుకోవడానికి ప్రయత్నించే సమస్యను నివారించడమే దేని ఉద్దేశ్యం.దీని ప్రకారం, నిందితుడిని గరిష్ఠంగా 15 రోజులపాటు కస్టడీలో విచారణ చేయవచ్చు, కాని కొన్ని నిబంధనలు ఉన్నాయి….
సెక్షన్.190 నిందితుడి నిర్బంధం కేవలం పోలీసు స్టేషన్లో పోలీసు కస్టడీగా లేదా జైలు కింద న్యాయ పరిరక్షణ కస్టడీగా లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జైలు ప్రదేశమని ప్రకటించిన ప్రదేశంలోనే జరగాలి.ఒకవేళ నిందితుడు కస్టడీలో లేకపోతే, పోలీసు అధికారి అతనివద్ద నుండి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు కల్పించేందుకు భద్రత (బాండ్ లేదా సెక్యూరిటీ) తీసుకోవాలి.మేజిస్ట్రేట్, “నిందితుడిని కస్టడీలో తీసుకోలేదు” అనే కారణంతో చార్జ్‌షీట్‌ను తిరస్కరించడం కుదరదు..
సెక్షన్ 193(3)(i)పోలీస్‌స్టేషన్ అధికారి, తయారుచేసిన పోలీస్ రిపోర్టును మేజిస్ట్రేట్‌కు ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా కూడా పంపవచ్చు.
అయితే సెక్షన్ 193(3)(i)(h)ఎలక్ట్రానిక్ సాక్ష్యం కోసం ప్రత్యేక నిబంధన జోడించబడింది.నిందితుడి మీద ఎలక్ట్రానిక్ పరికరాలను (ఉదా: మొబైల్, కంప్యూటర్ మొదలైనవి) సీజ్ చేసినట్లయితే, వాటి కస్టడీ క్రమాన్ని (sequence of custody) కూడా పోలీస్ రిపోర్టులో వివరించాలి.
సెక్షన్ 193(3)(ii)దర్యాప్తు ప్రారంభమైన 90 రోజుల్లోపల, పోలీసు అధికారి దర్యాప్తు పురోగతిని ఫిర్యాదుదారు బాధితునికి తెలియజేయాలి.ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా (మెసేజ్, ఇ-మెయిల్, ఆన్లైన్ పోర్టల్ మొదలైనవి) ఈ సమాచారాన్ని బాధితుడు/ఫిర్యాదుదారుని చేరవేయడం చట్టబద్ధంగా అంగీకరించబడింది…..
సెక్షన్ 193(8)ఆరోపితునికి ఇవ్వాల్సిన అన్ని పత్రాలను మరింత సులభతరం చేయడానికి పెట్టిన నిబంధన…పోలీస్ అధికారి, చార్జ్‌షీట్ ఫైల్ చేస్తున్నప్పుడు అవసరమైన అన్ని పత్రాలను, వాటి సూచికలతో (indexed documents) మేజిస్ట్రేట్ వద్ద సమర్పించాలి.ఇవి తదుపరి ఆరోపితునికి ఇవ్వబడతాయి.ఇంకా ఈ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలోనూ అందించడానికి సౌకర్యం కల్పించబడింది, దీని వలన పౌరులకి సులభతరం అయ్యేలా మారింది..
సెక్షన్ 193(9) – ఒకసారి చార్జ్‌షీట్ సమర్పించిన తరువాత కూడా అవసరం అయితే, మరిన్ని దర్యాప్తులు చేయవచ్చు.దీనికి గరిష్ఠంగా 90 రోజులు మాత్రమే సమయమివ్వబడింది.ఆపై 90 రోజులు దాటితే, కోర్టు అనుమతి తీసుకోవడమే తప్ప మరిన్ని రోజులు ఇవ్వలేరు….
సెక్షన్.194(2)ఆత్మహత్య కేసుల్లో రిపోర్టును జిల్లా మేజిస్ట్రేట్ లేదా ఉపవిభాగ మేజిస్ట్రేట్ (Sub-divisional Magistrate) కు 24 గంటలలోపు పంపవలసిందని స్పష్టమైన సమయపరిమితి విధించబడింది.
సెక్షన్ 195 – కొన్ని వర్గాల వ్యక్తుల కోసం ప్రత్యేక రక్షణ కల్పించబడింది.క్రింది వ్యక్తులు ఒక కేసులో వారి అవసరం ఉందని పోలీస్ అధికారులు వీరిని పోలీస్ స్టేషన్ కి పిలవకూడదు.తమ నివాస ప్రదేశం కాకుండా వేరే చోట హాజరు కావలసిన అవసరం ఉండదు:15 సంవత్సరాల లోపు బాలురు60 సంవత్సరాల పైబడిన పురుషులు (మునుపు 65 సంవత్సరాల వయసు వరకు మినహాయింపు ఉండేది, ఇప్పుడు 60 సంవత్సరాలు చేశారు)స్త్రీలుమానసిక/శారీరక వైకల్యాలున్నవారుతీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారువీరిలో ఎవరైనా స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్‌కి హాజరు కావాలని ఇష్టపడితే, వారిని అలా అనుమతించవచ్చు.
Sep 30 2025
ప్రభుత్వ కేసుల్లో ప్రైవేటు న్యాయవాది.
పోలీస్ కేసులలో ప్రభుత్వ ప్రాసిక్యూటరే కేసును నిర్వహించడం చూస్తాము. అయితే పిర్యాది దారు కోరితే ప్రాసిక్యూటర్‌కు సహాయంగా ప్రయివేటు న్యాయవాది ని కూడా పెట్టుకోవచ్చు. ప్రాసిక్యూటర్ సూచనలను, సలహాలను మేరకు ప్రైవేట్ అడ్వకేట్ నడుచుకోవాలి. విచారణ పూర్తి అయిన తర్వాత లిఖిత వాదనలను (written arguements) దాఖలు చేయు హక్కు ఆ న్యాయవాదికి ఉంటుంది…
సెక్షన్ 302 సి. ఆర్.పి.సి లో మేజిస్ట్రేటు అనుమతితో ఎవరైనా కేసును నిర్వహించవచ్చు:
1) ఒక కేసును విచారిస్తున్న మేజిస్ట్రేటు ఆ కేసును నిర్వహించు ప్రాసిక్యూటర్ అధికారము ఎవరికైనా ఇవ్వవచ్చు పోలీస్ అధికారికి కూడా ఇవ్వొచ్చు అయితే, ఇన్స్పెక్టర్ కన్న తక్కువ హోదాగల పోలీసు అధికారికి మాత్రము కేసును నిర్వహించు అధికారము ఇవ్వరాదు, అయితే, అడ్వొకేట్ జనరల్, లేక ప్రభుత్వ న్యాయవాది, లేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, లేక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు మాత్రము మేజిస్ట్రేటు ఎటువంటి ప్రత్యేక అనుమతి ఇవ్వనవసరము లేదు.
అయితే, ఒక కేసు యొక్క ప్రాథమిక విచారణతో ప్రమేయము ఉన్న పోలీసు అధికారికి కూడా ప్రాసిక్యూషన్ బాధ్యత ఇవ్వరాదు.
2) పై ఉపనిబంధన క్రింద మేజిస్ట్రేటు అనుమతి పొందిన వ్యక్తి తనకు తానుగానే ప్రాసిక్యూషన్ నిర్వహించుకొనవచ్చు. లేక న్యాయవాదిని నియమించుకోవచ్చు.
సాధారణంగా పోలీసు కేసులన్నీ ప్రాసిక్యూటర్లే నిర్వహిస్తారు. కోర్టు అనుమతితో ప్రయివేటు న్యాయవాదులు కూడా హాజరు కావచ్చు. కానీ కేసును నిర్వహించరాదని ఇంతకుముందు సెక్షన్లో తెలుసుకున్నాము. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో నిమిత్తము లేకుండా కేసు నిర్వహణను మరెవరికయినా సంక్రమింపజేయు విశేషాధికారము మేజిస్ట్రేట్లకు ఉంది. ఉదాహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై తనకు విశ్వాసము లేదని, అందువలన తన కేసును తానే వాదించుకుంటానని కాని ప్రైవేటు అడ్వకేట్ ను నియమించు కుంటానని కాని ఫిర్యాది (de-facto complainant) మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులో ఉదహరించిన కారణములు సమంజసమైనవేనని మేజిస్ట్రేటు భావిస్తే అనుమతించవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి లేక ఫిర్యాది తనకుతానుగానే కేసును నిర్వహించుకొనవచ్చు. లేక తనకు ఇష్టమైన న్యాయవాదిని నియమించుకొనవచ్చు.
ఈ సెక్షనులో వాడబడిన భాషను బట్టి కేసును నిర్వహించు అధికారము పోలీసు అధికారులకు కూడా ఇవ్వవచ్చు. అయితే, కేసు ప్రాథమిక విచారణతో ఆ అధికారికి ఎటువంటి సంబంధము ఉండరాదు. కేసును గురించి ప్రాథమిక పరిశీలన జరిపిన పోలీసు అధికారి నిష్పాక్షికంగా వ్యవహరించలేడు. అందువలన ఈ నిబంధన ఏర్పాటు చేయబడింది.
Sep 25 2025
ఒక ఆస్తి వివాదంలో సివిల్ మరియు క్రిమినల్ కేసులు రెండూ కొనసాగించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు
అమరావతి: ఒక ఆస్తి వివాదంలో సివిల్ మరియు క్రిమినల్ కేసులు రెండూ కొనసాగించవచ్చునని హైకోర్టు తీర్పు ఇచ్చింది.భవనం చిన వెంకటరెడ్డి వి. దంత్ల సుబ్బారెడ్డి & ఇతరులు
(ఫస్ట్ అపీల్ నెం. 1025/2016)
తీర్పు తేదీ: 23 సెప్టెంబర్ 2025
న్యాయమూర్తులు: జస్టిస్ రవి నాథ్ తిలహరి & జస్టిస్ మహేశ్వరరావు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది:ఒకే విషయానికి సంబంధించిన సివిల్ కేసు మరియు క్రిమినల్ కేసు రెండూ చట్టపరంగా అనుమతించబడతాయని తీర్పు సారాంసం.
Sep 24 2025
218.64 BNSS లో శాసన కర్తలు విది నిర్వహణ లో ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తూనే ఒక సన్నటి గీతను గీస్తూ కవచాన్ని బలహీనం చేశారు అనిపిస్తుంది.
ఒక పోలీస్ అధికారి (218 (1) పరిధి లో ఉన్న అధికారులు) ఒక పౌరుడు పై
ఫిల్తీ అబ్యూస్, అసాల్ట్ కి పాల్పడితే అటువంటి కేసుల్లో పోలీసు అధికారికి రక్షణ ఉండదు .అతనిపై ప్రాసిక్యూషన్ చేయుటకు మేజిస్ట్రేట్ కోర్టుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. సదరు అధికారి అల్ట్రావైర్స్ లో తన విధులను నిర్వహించినట్లు అని భావిస్తారు. ఉదాహరణకు ఒక సబ్ ఇనస్పెక్టర్ తన విధి నిర్వహణలో ఒక నేరస్తుని అదుపు లో తీసుకునే ప్రయత్నంలో సదరు నేరస్థుడు పారిపోతూ ఒక వాహనాన్ని గుద్ది చనిపోతే సదరు ఇనస్పెక్టర్ పై ఎటువంటి కేసు పెట్టడం కుదరదు మేజిస్ట్రేట్ కోర్టు లో కూడా ప్రైవేట్ కేసు వేయుటకు అవకాశం లేదు. ఎపుడు సదరు అధికారికి చట్ట పరమైన రక్షణ కవచం ఉంది.పైన పేర్కొన్న దానిలో బూతులు తిట్టినందుకు ప్రాసిక్యూట్ చేయొచ్చు . విధి నిర్వహణ లో మనిషి చనిపోయిన ప్రాసిక్యూట్ చేయడం కుదరదు. ఇన్స్పెక్టర్ ఒక వ్యక్తిపై అసభ్యకరమైన అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తే, అది అధికారిక విధి పరిధిలోకి రాదు. కాబట్టి, అలాంటి సందర్భంలో సాంక్షన్ అవసరం లేదు.లాక్‌ప్‌లో పెట్టిన complainant మీద పోలీసులు అసభ్యంగా దుర్వాక్యాలు ఉపయోగిస్తే, అది అధికారిక విధి కాదు. కాబట్టి సాంక్షన్ అవసరం కాదు.లంచం డిమాండ్ చేస్తూ అసభ్య పదజాలం ఉపయోగించినా, అది విధి నిర్వహణలో భాగం కాదని భావిస్తారు. అందువల్ల సాంక్షన్ అవసరం లేదు. ఇలా శాసన కర్తలు ఒక సన్నటి రేఖను ఏర్పాటు చేశారు. అటువంటి కేసులు నమోదు అయినప్పుడు లాయర్లు సూక్ష్మంగా వాటి పరిధిని అర్దం చేసుకుని న్యాయస్థానం లో తమ క్లయింట్లకు న్యాయం జరిపించవచ్చు. (క్లయింట్లు అధికారి కావచ్చు. పౌరుడు కావొచ్చు )
M SREENIVAS
